#TheFamilyManSeason2 : ఫస్ట్ లుక్’తోనే బయటపెట్టిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ద ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సీరీస్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సామ్ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా #TheFamilyManSeason2 టీజర్ ని వదిలారు. థ్రిల్లర్ మూడులో టీజర్ సాగింది. టీజర్ ఆఖరులో సామ్ లుక్ ని చూపించారు. ఒక్క లుక్ తోనే భయపెట్టేసింది. ఇక ఈ నెల 19న ట్రైలర్ ని వదలనున్నారు.

ఇందులో సమంత బోల్డ్ పాత్రలో కనిపించనుంది. ఇది వరకు ఎప్పుడూ కనిపించనంత హాటుగా కనిపించనుంది. సామ్ పాత్ర బోల్డ్ మాత్రమే కాదు.. థ్రిల్ ని పంచుతుందని చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రేక్షకులు తనని తిట్టుకుంటారని ఓ ఇంటర్వ్యూలో సామ్ తెలిపింది. అంత క్రూరంగా ఆమె పాత్ర ఉండనుందట. ప్రస్తుతం సామ్ చేతిలో సినిమాలేవీ లేవు. ఆమె హోస్ట్ గా వ్యవహరించిన సామ్ జామ్ కి కూడా ఎండ్ కార్డ్ పడిపోయింది.