మాస్టర్ సినిమాలో అత్తారింటికి దారేది కథ !

కోలీవుడ్ స్టార్ విజయ్ ‘మాస్టర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మాస్టర్ ని చూసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ? మాస్టర్ లో ‘అత్తారింటికి దారేది’ కథని వినిపించారు. రిలీజ్ ముందే మాస్టర్ సినిమాలోని కొన్ని సీన్స్ లీకైన సంగతి తెలిసిందే. ఈ లీకైన సీన్స్ లో ఓ సీన్ లో విజయ్ హీరోయిన్ మాలవిక మోహనన్ కు అత్తారింటికి దారేది కథ చెబుతాడు. ‘తన అత్తకు ఓ అందమైన కూతురు ఉందని తన గురించి చెప్పేందుకు స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేయించా’నని చెప్పాడు. ప్రస్తుతం ఈ క్లిప్‌ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ చిత్రానికి లోకేష్ కనగరాజు దర్శకుడు. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మాలవిక మోహనన్ హీరోయిన్‌. అర్జున్ దాస్, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు. ఇక మాస్టర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు. ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. సెకాంఢాఫ్ కాస్త స్లోగా సాగింది. రన్ టైమ్ కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పుకుంటున్నారు.