వైరల్ : పవన్ పండగ లుక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపిస్తే చాలు అభిమానులకు పూనకం వస్తుంది. అలాంటిది పవన్ కొత్త లుక్ లో కనిపిస్తే ఊరుకుంటారా ? ఆ లుక్ ని సోషల్ మీడియాలో వైరల్ చేయరు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అదే చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన పవన్.. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రిమేక్ షూటింగ్ ని మొదలుపెట్టేశారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రానా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ లో పవన్ పంచె కట్టులో మెరిశారు. కార్ వ్యాన్ నుండి పంచె ధరించి వస్తున్న పవన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ లుక్‌లో పవన్‌ని చూసిన అభిమానులు తెగ మెరిసిపోతున్నారు. పవన్ పంచె లుక్, పవన్ పండగ లుక్ అంటూ కామెంట్స్ తో కొడుతున్నారు. ఇక ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రిమేక్ తో పాటు క్రిష్ సినిమాలోనూ పవన్ నటించనున్నారు. ఈ రెండు పూర్తికాగానే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలతో పాటు బండ్ల గణేష్ కు పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది.