కేసీఆర్‌కు భట్టి లేఖ
సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. విద్యుత్ చట్టాలపై చేసిన విధంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత అవసరాల కోసం అన్నదాతల భవిష్యత్‌ను తాకట్టు పెట్టడం సరికాదని హితవు పలకారు. సాగు చట్టాలను కేంద్రం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలని సీఎం కేసీఆర్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ లోనూ తెరాస శ్రేణులు పాల్గొన్నాయి. అయితే గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ స్పష్టమైన మార్పు కనిపించింది. అప్పటిదాక వద్దన్న చట్టాలకి ఆయన ఓకే చెప్పేశారు. వాటిని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.