నాల్గో టెస్ట్ : ఆసీస్ 153/3

నాల్గో టెస్ట్ లో టాస్ గెలిచిన ఆసీస్ మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే ఆసీస్ కు ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్‌ వార్నర్‌(1), మార్కస్‌ హారిస్‌(5)లను త్వరలోనే పెలివియన్ కి చేర్చాడు. స్టీవ్‌ స్మిత్‌(36)ని సుందర్ బొల్తా కొట్టించాడు.ఇక లబూషేన్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే జారవిడిచాడు.

34వ ఓవర్‌లో స్మిత్‌ను సుందర్‌ ఔట్‌ చేస్తే, ఆ మరుసటి ఓవర్‌లో లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. 35 ఓవర్‌ ఐదో బంతికి లబూషేన్‌ గల్లీలో ఇచ్చిన స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌ క్యాచ్‌ను రహానే వదిలేశాడు. ప్రస్తుతం 153/3తో ఆటని కొనసాగిస్తోంది. లబుషేన్ 72, వేడ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.