TSలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం !
మహమ్మారి కరోనా వైరస్ కు టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని ప్రజలు ఎదురు చూశారు. ఇప్పుడా టైమ్ వచ్చేసింది. కరోనా వాక్సిన్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా ఈరోజు కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సినేషన్ ప్రారంభం అయింది.
తెలంగాణ రాష్ట్రంలో తొలి రోజు 140 కేంద్రాల్లో పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.64 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు, 20 వేల కొవాగ్జిన్ టీకా డోసులు అందుబాటులోకి వచ్చాయి.
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, తిలక్‌నగర్‌లోని యూపీహెచ్‌సీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టీకాల ప్రక్రియను ప్రారంభించారు.