20లక్షలు దాటిన కరోనా మరణాలు.. ఏ దేశంలో ఎన్నంటే ?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటింది. వుహాన్లో తొలిమరణం నమోదైన సరిగ్గా ఏడాది తర్వాత ఈ సంఖ్య నమోదు కావడం గమనార్హం. దేశాల వారీగా చూస్తే… కరోనా మరణాల్లో అమెరికా టాప్ లో ఉంది. భారత్ మూడో స్థానంలో ఉంది.
అమెరికా 3,91,922, బ్రెజిల్ 2,08,246, భారత్ 1,51,918, మెక్సికో 1,37,916, యూకే 87,448, ఇటలీ 81,325, ఫ్రాన్స్ 70,090, రష్యా 63,558 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవడం ఊరట కలిగిస్తోంది. అయితే, ప్రతిఒక్కరికీ టీకా అందేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.