పేషెంట్ జీరో.. చేతులెత్తేసిన WHO
కరోనా వైరస్ మహమ్మారి మూలాల శోధన ప్రారంభమైంది. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం వుహాన్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే, కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి ‘పేషెంట్ జీరో’ను కనుకుంటారని భావించారు. అయితే అది అసాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. పేషెంట్ జీరోను ప్రపంచం ఎన్నటికీ కనుక్కోకపోవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ వ్యాధుల విభాగం సాంకేతికాధిపతి మారయా వ్యాన్ కోర్కోవ్ అభిప్రాయపడ్డారు.
దర్యాప్తునకు చైనా తొలినుంచి అడ్డుపడుతున్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ మూలాలను శోధించడం కోసం పది మందితో కూడిన నిపుణుల బృందం వుహాన్‌లో అడుగుపెట్టిన సమయంలోనే జీరో పేషెంట్ ని కనుకోవడం అసాధ్యమని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. టీకా పంపిణీ ప్రక్రియ వచ్చే 100రోజుల్లో అన్ని దేశాల్లో ప్రారంభమవ్వాలని డబ్ల్యూహెచ్ వో ఆకాంక్షించింది.