ఫిబ్రవరి 18న సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం ?
మంత్రి కేటీఆర్ కు త్వరలోనే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చిలోపు కేటీఆర్ సీఎం అవుతారని తెరాస నేతలు చెబుతున్నారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 18న కేటీఆర్ కు పట్టాభిషేకం చేయనున్నట్టు తెలిసింది. అంతేకాదు.. అదే రోజున మంత్రి హరీష్ రావుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు.
ఈలోగా సీఎం కేసీఆర్ యాగాలు చేయనున్నట్టు తెలుస్తోంది. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం కేసీఆర్ నిర్వహిస్తారని సమాచారం. ఆ యాగాలు పూర్తయిన తర్వాత కొడుకు కు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఈ ప్రచారమే నిజమైతే.. తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రి గా ఫిబ్రవరి18 న కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.