టాలీవుడ్ లో విషాదం.. సింహాద్రి నిర్మాత కన్నుమూత !
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో బంజారాహిల్స్‌లోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. డిస్ట్రిబ్యూటర్‌గాను తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటిన దొరస్వామి ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహబలుడు సినిమాను తొలి సారి పంపిణీ చేశాడు. వీఎంసీ(విజయ మల్లీశ్వరి కంబైన్స్) పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించిన దొరస్వామి డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాలను తన సంస్థ పేరిట విడుదల చేశారు. సుమారు 750 చిత్రాలకు పంపిణీదారుగా ఉన్నారు.
నిర్మాతగా మారి..సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిచారు. సినిమాలే కాక రాజకీయాలలోను తనదైన ముద్ర వేసుకున్న దొరస్వామి 1994లో నగరి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన పని చేశారు. దొరస్వామి రాజు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.