ఫన్’కు నో హాలీడే !

ఫన్ మేజిక్ ని రిపీట్ చేయాలని ఆశపడుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వంలో వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఎఫ్ 2. 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్  హిట్ అయింది. ఇప్పుడీ ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సీక్వెల్ లోనూ వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు నటిస్తున్నారు. ఫన్ ఎక్స్ ట్రా డోస్ గా సునీల్, ఒకరిద్దరు కొత్త హీరోయిన్స్ కనిపిస్తారని సమాచారమ్.

ఆదివారం ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఫోటోని షేర్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. నాన్ స్టాప్ గా ఎఫ్3 షూటింగ్ జరుగుతోంది. అయినా.. ఫన్ కు నో హాలీడేస్ అని కామెంట్ పెట్టాడు. ఈ పిక్ లో వరుణ్ తేజ్, దిల్ రాజు, సునీల్.. తదితరులు కనిపిస్తున్నారు. ఈ పిక్ తో ఎఫ్ 3లో సునీల్ నటిస్తున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చినట్టయింది. అంతేకాదు.. అతి త్వరలోనే ఎఫ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.