అఖిలప్రియకు మరోసారి నిరాశే.. !!

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ని సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. అంతేకాదు..అఖిలప్రియపై పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో దాఖలు చేశారు. పోలీసులు ఐపిసి సెక్షన్‌ 359 డెకయిట్‌ (దోపిడీ) కేసు నమోదు చేశారు. దీంతో జీవితకాలం శిక్షపడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్‌ కోర్టు పేర్కొనడంతో… అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ కోర్టు రిటర్న్‌ చేసింది.

బెయిల్ కోసం అఖిలప్రియ న్యాయవాది నాంపల్లి కోర్టుని ఆశ్రయించనున్నారు. మరోవైపు ఈ కేసులో మరో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారమ్. కిడ్నాప్ కోసం మనుషులని సమకూర్చిన వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ రెడ్డి ఏ3 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.