విద్యుత్ శాఖపై కేటీఆర్ ప్రశంసలు
విద్యుత్ ఉద్యోగుల పనితీరుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ప్రగతిభవన్‌లోవిద్యుత్ ఇంజినీర్ల సంఘం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు.
ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా కేసీఆర్ ఇచ్చిన 24గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ హామీని నెరవేర్చడంలో ఆ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటు ఉందన్నారు. సీఎం ఆలోచనల మేరకు రాష్ట్రంలో వెలుగులు విరజిమ్ముతున్న విద్యుత్ శాఖ మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.