సుందరి గురించి షాకింగ్ నిజాలు

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో అరంగేట్రం చేసిన సుందర్‌ బ్యాటు, బంతితో అదరగొడుతున్నాడు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3కీలక వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 1 వికెట్‌ తీశాడు. ఇక టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి 144 బంతుల్లో 62 పరుగులు చేశాడు. 7 బౌండరీలు, 1 సిక్సర్‌ బాదేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (67; 115 బంతుల్లో 9×4, 2×6)తో కలిసి ఏడో వికెట్‌కు 123 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు.

ఈ ఆనందాన్ని సుందర్‌ తండ్రి మీడియాతో పంచుకొన్నారు. బాల్యం నుంచే అతడిలో పోరాటతత్వం ఉండేదని వివరించారు. వాషింగ్టన్‌కు తొమ్మిదేళ్లు ఉంటాయి. అండర్‌-14 అంతర్‌ పాఠశాలల మ్యాచుకు కొన్ని రోజుల ముందే సాధన చేస్తుండగా అతడి తలకు గాయమైంది. ఐదు కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి 39 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచును గెలిపించాడు. అతడు సవాళ్లకు భయపడడని ఆ రోజే నాకు అర్థమైంది. తన కుమారుడిని ఎక్కువ మంది స్పిన్నర్‌గా భావిస్తారని నిజానికి అతడు 70% బ్యాట్స్‌మన్‌ అని చెప్పారు.