TSలో రెండోరోజు టీకా పంపిణీ ఎలా జరిగిందంటే ?
రెండోరోజు 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పారు. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య 324కు పెరిగింది. రెండో రోజు ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేసినట్టు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. టీకా కేంద్రాలు అత్యధికంగా హైదరాబాద్లో 42 ఉంన్నాయి.
10 కంటే ఎక్కువగా టీకా పంపిణీ కేంద్రాలున్న జిల్లాల జాబితాలో ఆదిలాబాద్ (13), భద్రాద్రి కొత్తగూడెం (14), ఖమ్మం (15), మహబూబ్నగర్ (11), మేడ్చల్ మల్కాజిగిరి (11), నల్గొండ (18), నిజామాబాద్ (14), రంగారెడ్డి (14), సంగారెడ్డి (12), సిద్దిపేట (12), సూర్యాపేట (10), వరంగల్ అర్బన్ (14) జిల్లాలున్నాయి.
మరోవైపు రేపటి నుంచి అదనంగా 1000 వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తలసాని తెలిపారు. కొన్ని ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.అయితే కొంతమంది కావాలనే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చరు. వ్యాక్సిన్ తీసుకున్న వారంతా హ్యాపీగా ఉన్నారన్నారు.