ఆఖరి టెస్ట్.. ఆఖరి సెషన్ : టీమిండియా గెలుపు 145 రన్స్, చేతిలో 7 వికెట్స్ (37 ఓవర్స్)

ఆసీస్-భారత్ ల మధ్య ఆఖరి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. 328 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా పట్టుదలతో ఆడుతోంది. యువ ఓపెనర్ గిల్ 91 పరుగులతో రాణించారు. కెప్టెన్ రహానె 24 (22 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా 43, పంత్ 10 పరుగులతో ఉన్నారు. ఆఖరి సెషన్ లో 37 ఓవర్లు మిగిలి ఉన్నాయి. టీమిండియా విజయానికి 145 పరుగులు అవసరం. చేతిలో 7 వికెట్లు ఉన్నాయ్.

పట్టుదలతో ఆడితే ఆసీస్ కి టీమిండియా షాక్ ఇవ్వడం ఖాయం. ఒకవేళ వీర లెవల్లో పుంజుకుని ఆసీస్ బౌలర్లు బౌలింగ్ చేస్తే వారికి విజయవకాశాలున్నాయ్. గెలుపునకు వెళ్లి ఓటమి ఎందుకులే అనుకుంటే.. మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయ్. మొత్తానికి గెలుగు ఇరు జట్ల మధ్య దోబూచులాడే పరిస్థితుల్లో ఉంది.