పంత్ విమర్శకులపై సచిన్ పంచ్

రిషబ్ పంత్ లో ప్రతిభకు కొదవలేదు. అందుకే అతడిని మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా భావించారు. అవకాశాలు ఇచ్చారు. కానీ వాటిని పంత్ సరిగ్గా వాడుకోక విమర్శలకు తావునిచ్చారు. పంత్ ప్రతిభావంతుడే.. కానీ కేర్ లెస్ గా ఆడుతాడు. ఆటని సరిగ్గా అర్థం చేసుకోడు. జట్టు ఏ పరిస్థితుల్లో ఉందన్ని చూసుకోడనే విమర్శలున్నాయి. అయితే వాటన్నింటికి చెక్ పెడుతూ.. ఆసీస్ టెస్ట్ సిరీస్ లో పంత్ రాణించాడు. సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

సెకండ్ ఇన్నింగ్స్ లో 89 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుని విజయతీరాలని చేర్చాడు. తనెంత విలువైన ఆటగాడుతో బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇప్పుడు పంత్ ని తిట్టిన నోళ్లే.. పొగడ్తలు కురిపిస్తున్నాయ్. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పంత్ విమర్శలపై పంచ్ లేశాడు.

నాల్గో టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన వెంటనే.. ట్విట్టర్ వేదికగా సచిన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సీజన్ లో కొత్త హీరో పుట్టుకొస్తున్నాడని చెప్పిన సచిన్… ‘మేం ధైర్యంగా బౌండరీలు బాదుతాం. కానీ కేర్ లెస్ కాదు’ అని కోడ్ చేశాడు. ఇది ఇన్నాళ్లు పంత్ పై విమర్శలు చేసిన వారిపై సచిన్ వేసిన పంచ్ అని ఈజీగా అర్థమైపోతుంది. ఇక టీమిండియాలో పంత్ బెర్త్ కు కొన్నాళ్లు ఢోకాలేదు. ఈ లోపు పంత్ నిలకడ సాధిస్తే.. ధోని వారసుడిగా జట్టులో స్థిరపడిపోవచ్చని చెప్పవచ్చు.