యాదవ్.. రాజులకి సారీ చెప్పాడు !
మంత్రి తలసాని గంగపుత్రులకి క్షమాపణలు చెప్పారు. ఇటీవల కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, తలసాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తలసాని.. ఇకపై ముదిరాజులు ఎవరి దయా దాక్షిణ్యాల కింద ఉండాల్సిన అవసరం లేదన్నారు.మత్స్యకార సొసైటీలలో అందరికీ సభ్యత్వం ఉందని.. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు ప్రకటించారు. అయితే మంత్రి మాటలతో గంగపుత్రులు నొచ్చుకున్నారు. గ్రామాల్లో మంత్రి వ్యాఖ్యలకి నిరసనగా ఆందోళనకి దిగారు. రోజురోజూకి.. అవి ఎక్కువవుతున్నాయ్.
ఈ నేపథ్యంలో మంత్రి తలసారి స్పందించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులతో మంత్రి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్రులకి మంత్రి సారి చెప్పారు. ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో ముదిరాజ్‌లను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడానే తప్ప ఎవరినీ బాధ పెట్టే విధంగా ప్రసంగించలేదని వివరించారు. మరీ.. ఇప్పటికైనా తలసానిని గంగపుత్రులు క్షమిస్తారేమో చూడాలి. ఇక యాదవ్.. రాజులకి సారీ చెప్పాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.