డిజిటల్ యుగానికి అంకురార్పణ చేసిన నారాయణ ఎన్ లెర్న్ యాప్ !
ట్రెండ్ మారుతోంది, అన్ని రంగాలు ఇప్పుడు మారుతున్న ట్రెండ్ కి సరిపోయేట్టు సిద్దమవుతున్నాయి. ఒకప్పుడు విద్య నేర్చుకునేందుకు అరణ్యాలలో ఉండే గురువుల వద్ద వారి గురుకులంలో ఉండి విద్య నేర్చుకునేవారు. కాని ప్రస్తుతం విద్య అనేది డిజిటల్ మీడియా వరకు వచ్చేసింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే డిజిటల్ గానే విద్యా భోదన జరుగుతుండగా మన దేశంలో కూడా డిజిటల్ విద్యా భోదన మొదలయ్యింది.
అయితే తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ విద్యాసంస్థలలో నెంబర్-1 గా ముద్రపడిన నారాయణ దానిని విద్యార్ధులకి మరింత చేరువ చేసే మహత్కార్యానికి శ్రీ కారం చుట్టింది. తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్య అనేది ఎవరికీ తెలియని రోజుల్లోనే అదంటే ఏంటో తెలియచెప్పి ఎంతో మంది విద్యార్ధులని డాక్టర్ లని, ఇంజినీర్ లని చేసిన నారాయణ సంస్థ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విద్య ని డిజిటలైజ్ చేసేందుకు నడుం బిగించింది. జూనియర్ కాలేజీ విద్యార్ధులకి హడలెత్తించే ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకి వెళ్ళే విద్యార్ధులకి ఎంతో ఉపయుక్తంగా ఉండే ఎన్ లెర్న్ అనే మొబైల్ అప్లికేషన్ ని విడుదల చేసింది నారాయణ సంస్థ.
ఈరోజు మాదాపూర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నారాయణ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా సింధూర లాంచ్ చేశారు. అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు 40 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రత్యేక సందర్భంలో ఈ డిజిటల్ విద్య అనే కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యకి పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి యాప్ ఒకటి తాయారు చేశామని, విద్యారంగంలో ఇటువంటి నూతన ఆవిష్కరణ చేయడంలో నారాయణ ఒక వేదిక కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటగా విద్యావిధానానికి సాంకేతికత జోడించిన విద్యాసంస్థగా నారాయణ ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని అన్నారు.
ఇక యాప్ విషయానికి వస్తే యాప్ మొత్తం మూడు విభాగాలుగా విభజించడం జరిగింది, అందులో ఒకటి నేర్చుకోవడం దేశంలోనే నిష్ణాతులయిన అధ్యాపకుల చేత ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ మాత్రమే కాకుండా ముఖ్యమయిన పుస్తకాల్ని డిజిటలైజ్ చేసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఇక రెండవ విభాగం పరీక్షలు, మొత్తం మూడు సబ్జెక్టులలో సుమారు 500 టాపిక్స్ కవర్ చేయడం ద్వారా 50000 ప్రశ్నలు అందుబాటులో ఉంటాయి, ఇవన్నీ మల్టిపుల్ ఆన్సర్ టైపులో ఉంటాయి.
ఇక పోతే మూడవ విభాగం వాల్యుయేషన్, అంటే విద్యార్ధులు యాప్ లో వ్రాసిన పరీక్షలకి వెనువెంటనే అక్కడే సమాధానాలు రావడం వల్ల ఎక్కడెక్కడ తప్పు చేశారు, ఎలా సరిదిద్దుకోవాలి అనేది అర్ధమవుతుంది. ఈ యాప్ పోటీ పరీక్షల విద్యార్ధులకి వరం అనే చెప్పాలి. అయితే కాస్త నిరుత్సాపరిచే విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ యాప్ నారాయణ విద్యార్ధులకి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఇంకొద్దిరోజుల్లో విద్యార్ధులందరికి నామమాత్రపు రుసుముతో ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.