బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్ !

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టైన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు 19 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌లను ఇవాళ పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి మూడురోజుల కస్టడీకి తీసుకున్నారు.

అపహరణలో నిందితులిద్దరూ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. కస్టడీకి తీసుకున్న ఇద్దరు నిందితులతో రేపు పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డు చేయనున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి సికింద్రాబాద్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.