ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులు : TS నెం.4, AP నెం.7
ఇన్నోవేషన్ ఇండెక్స్ -2020ని నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో గతేడాదిలాగే మళ్లీ కర్ణాటకే తొలి ర్యాంక్‌లో నిలిచింది. తెలంగాణ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకోగా.. గతేడాదిలో 10 స్థానంలో ఉన్న ఏపీ మరింతగా మెరుగుపడి ఏడో స్థానంలోకి వచ్చింది.
దేశంలోని 17 పెద్ద రాష్ట్రాలు/ 10 ఈశాన్య రాష్ట్రాలు/ 9 కేంద్రపాలిత, సిటీ స్టేట్స్‌గా విభజించి వాటి పనితీరు ఆధారంగా ఈ ఇండెక్స్‌ను రూపొందించింది.
17 పెద్ద రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ, కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ, పంజాబ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లు నిలిచాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్ తొలి ర్యాంక్‌లో నిలవగా.. కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో దిల్లీ అగ్రస్థానంలో ఉంది.