కాంగ్రెస్’కు అధ్యక్షుడు దొరికాడు

వంద యేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పూర్థి స్థాయి అధ్యక్షుడు కరువయ్యాడు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత.. తాత్కాఌకంగా సోనియాగా గాంధీ అధ్యక్ష బాధతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోవాలని.. పూర్తిస్థాయి అధ్యక్షుడుని నియమించాలని సీనియర్లు, పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ విసృతస్థాయి సమావేశం నిర్వహించింది.

అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు నిర్వహించాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. అందురు కోరుకుంటే.. పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి తనకేమీ అభ్యంతరం లేదని రాహుల్ కూడా అన్నాడు. దీంతో యువనేత మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయం అనుకున్నారు. కానీ అందుకు రాహుల్ సన్నద్ధంగా లేదని సమాచారమ్. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ కు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

గతంలోనే రాహుల్ కాదంటే..  అశోక్ గహ్లోట్ కు అధ్యక్ష బాధత్యలు అప్పగిస్తారనే చర్చ జరిగింది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు ఆయన సుకుముఖత చూపలేదని సమాచారమ్. అయితే ఈ సారి స్వయంగా సోనియాగాంధీ ఆయన్ని ఒప్పించనున్నారని తెలిసింది. ఒకవైపు గెహ్లాట్ తన మంత్రి మండలి విస్తరణలో తలమునకలైవుండగా, మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం అతనిని ఢిల్లీకి పిలిపించింది. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.