ఎక్కితొక్కేస్తున్న క్రాక్

రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం క్రాక్. సంక్రాంతి కానుకగా వచ్చిన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి విజేత అనిపించుకుంది. సంక్రాంతి బరిలో క్రాక్ తో పాటు రెడ్, అల్లుడు అదుర్స్, మాస్టర్.. తదితర సినిమాలు నిలిచాయ్. ఇప్పుడీ.. ఈ సినిమాలు క్రాక్ దెబ్బకు విలవిలాడుతున్నాయ్. అవునూ.. మిగితా సినిమాలని తీసేసి క్రాక్ సినిమాని ప్రదర్శిస్తున్నారట. ప్రస్తుతం 50 ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ 50 థియేటర్స్ నిండకుంటే ఇబ్బందే. ఈ నేపథ్యంలో ప్లాప్ టాక్, మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలని తీసేసి.. క్రాక్ ని ప్రదర్శిస్తున్నారట.

మరోవైపు క్రాక్ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులని అల్లు అరవింద్ కొనుగోలు చేశారు. దీంతో అతి త్వరలోనే క్రాక్ ఆహా.. ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారమ్. ఇక ఈ సినిమాని తమిళ్, హిందీలోనూ రిమేక్ చేసేందుకు అప్పుడే ప్లాన్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎక్కడికి వెళ్లిన హిట్ గ్యారెంటీ అనే నమ్మకంతో.. రిమేక్ లకి చాలా స్పీడుగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజకి  జంటగా శృతిహాసన్ నటించింది. థమన్ సంగీతం అందించారు. ఠాగూర్ మధు నిర్మించారు.