సుశాంత్ బర్త్ డే : బాలీవుడ్ ఎమోషనల్.. కంగనా షాకింగ్ ట్విట్ !
జనవరి 21 – బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 35వ పుట్టినరోజు. ఈ సందర్బంగా బాలీవుడ్ ఎమోషనల్ అయింది. సుశాంత్.. అభిమానులు, సన్నిహితులు, సహా నటీనటులు భావోద్యేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో ఆయన ఫొటోలను షేర్ చేస్తున్నారు. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కూడా అతడి ఫొటోలను పంచుకున్నారు. దీనికి ‘లవ్ యూ భాయ్.. మీరు మా జీవితంలో భాగం. నిన్ను ఎప్పటికి మర్చిపోలేము’ అని పేర్కొంది.
శ్వేతా పోస్టు చూసిన సుశాంత్ అభిమానులు ‘లెజెండ్స్‌కు మరణం లేదు’, ‘సుశాంత్ ఎప్పటికి మన గుండెల్లో బ్రతికే ఉంటారు. ఈ రోజు సుశాంత్ మనతోనే ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుశాంత్ బర్త్ డే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ట్విట్ చేసింది. ‘మూవీ మాఫియా నిన్ను చాలా వేధించారు. సోషల్ మీడియాలో చాలా సార్లు సాయం కోసం అర్దించారు. ఆ సమయంలో నేను సోషల్ మీడియాలో లేనందుకు చింతిస్తున్నాను. అతని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఫ్లాపులుగా ప్రకటించబడ్డాయి. సుశాంత్ మరణానికి వారే కారణం. నిందితులని అస్సలు క్షమించ వద్దు’ అంటూ కంగనా వరుస ట్వీట్స్ చేసింది.
I have said enough about this but still it isn’t enough. Chronology of Sushant murder.
1) Fall out with Aaditya Chopra because self made Sushant refused to be bound by their evil capitalists contracts.Chopra promised to destroy him.
2) KJO and Chopra bound by Nepotism love (cont)— Kangana Ranaut (@KanganaTeam) January 21, 2021