బంగారు బుల్లోడు.. రియల్ స్టోరీ !
ఓవైపు కామెడీ చిత్రాలు చేస్తూనే మరోవైపు సీరియస్ పాత్రల్లో ఒదిగిపోతూ తనలోనూ అసలైన నటుడిని వెలికి తీస్తున్నాడు అల్లరి నరేష్. ఆయన తాజా చిత్రం బంగారు బుల్లోడు. ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
కథలోనే కామెడీ ఉంటుంది. కామెడీ కోసం కథ పెట్టలేదు. రాజమండ్రిలోని ఒక బ్యాంకులో జరిగిన ఘటన ఇది. ఒక మేనేజర్ నకిలీ నగలు పెట్టి డబ్బుతో పరారవుతాడు. ఆ కథ ఆధారంగానే ఈ సినిమాను తీర్చిదిద్దాం.ఈ సినిమాలో బంగారం తయారు చేసే పాత్ర నాది. గ్రామీణ బ్యాంకులో బంగారం తాకట్టుపెడితే ఎంత రుణం ఇవ్వొచ్చు అని చెప్పే ఉద్యోగిగా హీరో పనిచేస్తుంటాడు. ఈ సినిమా మొత్తం బంగారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే బంగారంతో వచ్చే టైటిల్ పెట్టాలని అనుకున్నామని చెప్పారు.