స్టేజ్ పైనే ఏడ్చేసిన హీరోయిన్
క్రికెట్ బెట్టింగ్ కథాంశంగా తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ ఓవర్’. బెట్టింగ్ వల్ల సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది క్షుణ్ణంగా తెలియజేస్తూ తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో ‘కలర్‌ఫొటో’ ఫేమ్ చాందినీ చౌదరి, నవీన్‌చంద్రా ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు సుధీర్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రవీణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు.. అనుకోకుండా కారు ప్రమాదం చోటుచేసుకోవడంతో దర్శకుడు ప్రవీణ్ కన్నుమూశారు. దీంతో మిగిలిన చిత్రాన్ని సుధీర్ వర్మ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
తాజాగా జరిగిన ఈ సినిమా ప్రమోషన్‌లో ప్రవీణ్‌ను గుర్తు చేసుకుని ఛాందినీ, నవీన్, దర్శకుడు సుధీర్ కన్నీరు పెట్టుకున్నారు. ‘మా సినిమా ‘సూపర్ ఓవర్’ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసినందుకు ప్రవీణ్‌కు థ్యాంక్యూ. ఈ చిత్రాన్ని ప్రవీణ్‌కే అంకితం చేస్తున్నాం. తను ఎక్కడ ఉన్నా సరే ఈ చిత్రాన్ని వీక్షించి సంతోషిస్తాడని అనుకుంటున్నా. మీ అందరితో కలిసి పనిచేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది’ అంటూ నటి చాందినీ కన్నీరు పెట్టుకున్నారు.