ఏపీ పంచాయతీ ఎన్నికలు.. తెదేపా కొత్త డిమాండ్ !
ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకి ప్రభుత్వం నో అంటోంది. ఎన్నికల సంఘం మాత్రం నిర్వహించి తీరుతాం అంటోంది. ఫైనల్ గా ఎన్నికల సంఘం తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సోమవారం (జనవరి 25) నుంచే నామినేషన్స్ ని స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెదేపా కొత్త డిమాండ్ ని తెరపైకి తెచ్చింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోరుతోంది. ఈ మేరకు ఆ పార్టీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య శనివారం ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి.. వారు పని చేస్తున్న రెవెన్యూ డివిజన్లలో కాకుండా ఇతర చోట్ల విధులు వేయాలని కోరారు. పంచాయతీ ఎన్నికలను కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలనిఆయన కోరారు.