సంజూ శాంసన్’కు కెప్టెన్సీ.. మిల్లర్ కామెంట్ !

యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ప్రమోషన్ కొట్టేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఐపీఎల్ లో రాజస్థాన్‌ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నారు. సంజూని కెప్టెన్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఆ జట్టు ఆటగాడు డేవిడ్ విల్లర్… రాజస్థాన్‌ రాయల్స్‌ తనని అట్టిపెట్టుకోవడంపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

రాబోయే సీజన్‌లోనూ రాజస్థాన్‌తో కొనసాగడం సంతోషకరమని, ఒక కుటుంబంలా ఉండే ఆ ఫ్రాంఛైజీలోని వాతావరణం తనకెంతో ఇష్టమని చెప్పాడు. అలాగే ఈసారి సంజూ శాంసన్‌ నేతృత్వంలో జట్టు విజయాల కోసం తోడ్పటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మిల్లర్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 80 మ్యాచ్‌లు ఆడగా, 1,850 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 9 అర్ధశతకాలు సాధించాడు.