రైతుబంద్ పేరు మారింది


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం రైతుబంధు. దేశంలోనే ఇలాంటి పథకం లేదు. ఈ పథకంతో తెలంగాణ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడీ ఇదే టైటిల్ తో ప్రముఖ నటుడు నటుడు ఆర్..నారాయణమూర్తి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు గురించి చెప్పడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతులు చట్టాలని వెనక్కి తీసుకోవాలని కోరనున్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ రైతు బంధుని రైతన్నగా మార్చారట. ఈ సినిమా గురింది నారాయణమూర్తి మాట్లాడుతూ.. “రైతులకు మేలు జరుగుతుందని కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. ‘ఆ చట్టాలు మాకు ఉరితాళ్లు’ అని ఉత్తరాది రాష్ట్రాల రైతులు ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం అంతా కార్పొరేట్‌ మయం అయిపోతుంది. మార్కెట్‌ యార్డుల వ్యవస్థ పోయి రైతులు నష్టపోతారు. వ్యవసాయం కూడా ప్రైవేట్‌ పరం అయితే ఈ దేశం ఎక్కడకు పోతుంది? ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని ‘రైతన్న’ చిత్రం ద్వారా కోరుతున్నా”నన్నారు.