పెళ్లి తర్వాత కూతురుతో మాటల్లేవ్

మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ ముచ్చట చెప్పాడు. పెళ్లి తర్వాత కూతురుతో మాటల్లేవ్. మునుపటిలా మాట్లాడుకోవడం లేదని తెలిపారు. నా కూతురు నా బెస్ట్ ఫ్రెండ్. ప్రతి విషయాన్ని నిహారికతో మాట్లాడేవాడిని. మేమిద్దరం చాలా ఎక్కువసేపు మాట్లాడుకునే వాళ్లం. కానీ పెళ్లి తర్వాత కూతురుతో మాట్లాడటం చాలా తగ్గించేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు.. వరుణ్ తేజ్ పెళ్లి గురించి కూడా నాగబాబు స్పందించారు.

వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి చేసుకున్నా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా.. ఒకే. కానీ అర్థం చేసుకొనే అమ్మాయి దొరకాలని ఆకాంక్షించారు. అయితే వరుణ్ తేజ్ పెళ్లెప్పుడు ? అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ముకుందా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఫిదా, గద్దలకొండ గణేష్, ఎఫ్2 సినిమాలతో విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గని, ఎఫ్ 3 సినిమాల్లో నటిస్తున్నారు.