స్టేజ్’పైనే కుప్పకూలిన దర్శకుడు
యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన చిత్రం ’30రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. ప్రదీప్ కి జంటగా అమృతా అయ్యర్ జతకట్టింది. కన్నడ నిర్మాత ఎస్వీ బాబు నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసే బాధ్యతను యువి/గీతా సంస్థలు టేకప్ చేశాయి. సినిమా ప్రచారాన్ని కూడా మొదలెట్టాయి.
తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శకుడు మున్నా స్టేజ్ పైనే కళ్లు తిరిగి పడిపోయారు. పని ఒత్తిడి కారణంగానే ఆయన అస్వస్థతకి గురైనట్టు తెలిసిందిఈ చిత్రంలోని ‘నీలినీలి ఆకాశం.. ‘ అనే పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.