పెళ్లి సమయంలో ఏడ్చేసిన నిహారిక (వీడియో)

మెగా బ్రదర్  నాగబాబు నిహారిక తన పెళ్లి సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఓ వీడియోని షేర్‌ చేశారు. నిహారిక పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది.

‘ప్రియమైన నిహా.. వివాహబంధంతో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. ముప్పైయేళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని తెలిసింది’ అంటూ చైతన్య పంపించిన సందేశం చూసి నిహారిక కన్నీళ్లు పెట్టుకోవడం వీడియోలో చూడొచ్చు.

కల్యాణ తిలకం దిద్దే సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను హత్తుకుని నిహారిక ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా పెళ్లి మండపంలో మెగాబ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సరదాగా మాట్లాడుకోవడం.. వరుణ్‌తేజ్ కు బన్నీ ముద్దు ఇవ్వడం… వీడియోలో చూడొచ్చు. మొత్తంగా… నిహారిక షేర్ చేసిన వీడియో ఎమోషనల్ గా సాగింది.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)