#RRR రిలీజ్ డేటు పోస్టర్’పై కాపీ మరక !


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ  సినిమాని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రిలీజ్ డేట్ పోస్టర్ పై అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) గుర్రంపై, కొమరం భీమ్ (ఎన్టీఆర్) బుల్లెట్ బైక్ పై దూసుకెళ్తున్నారు. అయితే ఈ పోస్టర్ కాపీ అని నెటిజన్స్ ఇట్టే కనిపెట్టేశారు. దానికి సాక్షం కూడా చూపించారు.

‘ఘోస్ట్ రైడర్’ పోస్టర్ #RRR రిలీజ్ డేటు సేమ్ టు సేమ్ ఉన్నాయి. ‘ఘోస్ట్ రైడర్’ పోస్టర్ లో గుర్రం, బైక్ లపై మనుషులను చూపించకుండా ఘోస్టులని చూపించారు.ఆర్ఆర్ఆర్ రిలీజ్ పోస్టర్ లో మాత్రం గుర్రంపై చరణ్, బైక్ పై తారక్ ఉన్నారు. మిగితాదంతా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘోస్ట్ రైడర్ కి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేటు పోస్టర్ కాపీ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. స్వాత్రంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య గల ఓ కామన్ పాయింట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కథని రాసుకొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.