‘అన్నాత్తే’ రిలీజ్ డేటు వచ్చేసింది


సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి అభిమానులని తీవ్రంగా నిరాశపరిచారు. పొలిటికల్ ఇంట్రీ ఇస్తానని.. ఆఖరి నిమిషంలో రజనీ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. రజనీ నిర్ణయంతో ఆయన అభిమానులు నొచ్చుకున్నారు. నిరాశచెందారు. అయితే పొలిటికల్ గానే కాదు.. సినిమాల పరంగానూ రజనీ నుంచి అభిమానులకి నిరాశతప్పడం లేదు. రజనీ తాజా చిత్రం అన్నాత్తే. శివ దర్శకుడు. నయనతార, కీర్తి సురేష్, కుష్బూ, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటితున్నారు. సమ్మర్ లో అన్నాత్తే రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిని నిరాశపరుస్తూ.. ‘అన్నాత్తే’ దీపావళీకి వెళ్లింది. 

తాజాగా అన్నాత్తే రిలీజ్ డేటుని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 4, 2021న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసారు.ఇక ఈ సినిమా కోసం తెలుగు టైటిల్ గా అన్నయ్య, పెద్దన్నయ్య టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ‘పెద్దన్నయ్య’ టైటిల్ దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు. ‘అన్నయ్య’ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చింది. ఇక పెద్దన్నయ్య టైటిల్ తో బాలయ్య సినిమా వచ్చింది. అయితే రజనీ మాత్రం బాలయ్య టైటిల్ కే ఓటేసినట్టు సమాచారమ్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్. నిర్మిస్తోంది.