TSలో పీఆర్సీ నివేదిక విడుదల
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిటి (పీఆర్సీ) నివేదిక విడుదల చేసింది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫార్సు చేసింది. అలాగే పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఈ నివేదికని ఆన్ లైన్ వెబ్ సైట్ లోనూ ఉంచారు. అయితే ఇదే ఫైనల్ నివేదిక కాదు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు 13 గుర్తింపు సంఘాలతో సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చలు అన్ని సంఘాల సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్‌కు బ్రీఫ్ నోట్ ఇవ్వనుంది. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ఫిట్ మెంట్ ప్రకటించనున్నారు.
పీఆర్సీ చేసిన సిఫార్సులు :
* మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు.
* ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని ప్రతిపాదన
* గరిష్ఠ వేతనం రూ. 1,62,070 వరకూ ఉండొచ్చని సిఫార్సు
* ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఎళ్లకు పెంచాలని సిఫార్సు..
* హెచ్ఆర్ఏ తగ్గిస్తూ సిఫార్సు..
* గ్యాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు..
* శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు..
* సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది.