మెగా సప్రైజ్ : ‘ఆచార్య’ టీజర్ అప్ డేటు వచ్చేసింది

మెగా అభిమానులకి దర్శకుడు కొరటాల శివ సడెన్ సప్రైజ్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేటుని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 29న సాయంత్రం 4:05 నిమిషాలకి ధర్మస్థలి డోర్స్ తెరచుకోనున్నాయి. టీజర్ ని రిలీజ్ చేయబోతున్నామని దర్శకుడు కొరటాల ట్విట్ చేశారు. దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రామిస్ ని నిలబెట్టుకున్నందుకు థ్యాంక్స్ కొరటాల శివ అని రిప్లై ఇచ్చారు.

ఆచార్యలో చిరుకి జంటగా కాజల్ నటిస్తోంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వేసవిలో ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తోనే ఆచార్య తెరకెక్కుతోందని సమాచారమ్.