గ్రేట్ : ఆఖరి బంతికి ధోనీలా.. హెలికాప్టర్‌తో గెలిపించాడు

శ్రీలంకతో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో మహేంద్ర సింగ్ ధోని కొట్టిన హెలికాప్టర్ సిక్సర్ ని క్రికెట్ ప్రేమికులు మరచిపోలేరు. చనిపోయే ముందు ధోని కొట్టిన ఆ సిక్సర్ చూడాలని సునీల్ గవాస్కర్ అన్న సంగతి తెలిసిందే. అలాంటి అద్భుతమైన షాట్ నే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ లో విష్ణు సోలంకి కొట్టాడం విశేషం.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా హరియాణా, బరోడా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌ చేసిన హరియాణా 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. హెచ్‌ రాణా (49; 40 బంతుల్లో 7×4), శివమ్‌ చౌహాన్‌ (35; 29 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. చేధనలో కేదార్‌ దేవ్‌ధర్‌ (43; 40 బంతుల్లో 2×4, 2×6) సాయంతో వన్‌డౌన్‌లో వచ్చిన విష్ణు సోలంకి (71*) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. విజయ సమీకరణం ఆఖరి 6 బంతుల్లో 18 పరుగులుగా మారింది. సుమిత్‌ కుమార్‌ బౌలింగ్‌కు వచ్చాడు. ఆఖరి బంతికి 4 పరుగులు చేస్తే సూపర్‌ ఓవర్ లేదా సిక్సర్‌ బాదితే విజయం. ఇలాంటి ఉత్కంఠకర క్షణాల్లో విష్ణు మాయ చేశాడు. బౌలర్‌ వేసిన చక్కని యార్కర్‌కు ముందే సిద్ధమై హెలికాప్టర్ షాట్‌తో స్ట్రెయిట్‌గా సిక్సర్‌ బాదేశాడు. జట్టును సెమీస్‌కు చేర్చాడు.