అన్నయ్య సపోర్ట్’ని వాడుకోలేకపోతున్న పవన్ 

తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగనున్నాడు. జనసేన తరుపున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయబోతున్నాడు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో చిరంజీవి పాల్గొంటారనే ప్రచారం ఒకట్రెండు రోజులుగా జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జనసేనకు మెగాస్టార్ చిరంజీవి నైతిక మద్దతు ఉంటుందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చేసిన కామెంట్ నే ఈ ప్రచారానికి కారణం.

జనసేనకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు అనే ప్రచారంతో.. జనసైనికుల్లో ఊపొచ్చింది. కాపు వర్గం జనసేన వైపు ఆసక్తిగా చూడటం మొదలెట్టింది. అయితే వారిని ఆసక్తిని పవన్ ఎంతో సేపు ఉంచలేదు. ఫట్ మని కట్ చేసేశారు. శుక్రవారం కాపు సంక్షేమ సేన సమావేశంలో మాట్లాడిన పవన్.. తాను ఓ కులానికి ప్రతినిధిని కాదని..అందరివాడినని చెప్పారు.

అన్నయ్య సపోర్ట్ పై స్పందిస్తూ.. చిరంజీవి ఎప్పుడూ నా మేలుకోరే చెబుతారు. తమ్ముడిగా నా విజయం సాధించాలని ఆయన కోరుకుంటారు. మనస్ఫూర్తిగా నా విజయాన్ని ఆకాంక్షించే వ్యక్తి. దాన్ని అలాగే చూడాలి. ఆయన పార్టీలోకి వస్తారా లేదా అనేది ఈరోజే చెప్పలేను. అది చిరంజీవి గారి అభిప్రాయం అన్నారు. దీనికి బదులుగా అవునూ.. అన్నయ్య సపోర్ట్ చేస్తే తప్పేముంది ? అంటే సీన్ మరోలా ఉండేది. తిరుపతిలో జనసేన హిట్ అయ్యేదేమో.. !