CBSEలో కొత్త రూల్.. ఫెయిల్ అయినా పాసైనట్టే.. !

విద్యార్థుల్లో కొందరు కొన్ని సబెక్టుల్లో బ్రిలియంట్ గా ఉంటారు. మరికొన్ని సబ్జెక్టుల్లో వీక్ గా ఉంటారు. ఇష్టమైన సబ్జెక్ట్ లో 90%పైగా మార్కులు తెచ్చుకుంటే.. వీక్ గా ఉన్న సబ్జెక్టుల్లో మాత్రం అత్తెసరు మార్కులతో పాసవుతుంటారు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటారు కూడా. దీంతో ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ కొత్త రూల్స్‌ను ని తీసుకొస్తోంది.

ఇకపై ఓ విద్యార్థి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా.. ఇతర ఏ సబ్జెక్టుల్లో అయినా ప్రతిభను చాటితే వారిని ఫెయిల్ కాకుండా పాస్ అయిన వారిగా గుర్తిస్తారు. సీబీఎస్ఈలో త్వరలో అమలు చేయనున్న ఈ విధానం వల్ల ఎంతో మంది విద్యార్థులకు లాభం కలుగుతుందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.