మహేష్’తో మోనాల్ హగ్గులు.. ముద్దులు !

హీరోయిన్ మోనాల్ గజ్జర్ హగ్ లు.. ముద్దులకి గిరాకీ పెరిగింది. ఆమె కౌగిలి కోరుకుంటున్న వారి జాబితా పెరుగుతోంది. ఈ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉండటం విశేషం. అవునూ.. మోనాల్ హగ్ లు, ముద్దులకి మహేష్ కూడా ఫిదా అయ్యారట. అవి నాకు కావాలని అడిగారట. చేసేదేమీ లేక.. మహేష్ కోసం మోనాల్ ని రెడీ చేస్తున్నట్టు సమాచారమ్. అసలు విషయం ఏంటంటే ? బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో మోనాల్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ హాట్ గా కనిపించింది. అటు అఖిల్, ఇటు అభిజిత్ తో రొమాన్స్ చేసింది. ట్రై యాంగిల్ లవ్ స్టోరీని నడిపింది. మోనాల్-అఖిల్ ల హగ్ లు, కిస్సులు బిగ్ బాస్ 4కే హైలైట్ గా నిలిచాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన ఆమె నుంచి వాటినే ఆశిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ టాలెంట్ ని చూసిన దర్శక-నిర్మాతలు ఆమెని వాడుకుంటున్నారు. బిగ్ బాస్ షో పూర్తికాగానే అల్లుడు అదుర్స్ లో స్పెషల్ సాంగ్ చేసింది.. మోనాల్. దానికి మంచి పేరొచ్చింది. దీంతో.. ఆమెని అందరు ఐటమ్ గా భావిస్తున్నారు. ఇప్పుడు మహేష్ సినిమాలోనూ మోనాల్ ఐటమ్ సాంగ్ చేయనుందని సమాచారమ్.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉందట. ఈ సాంగ్ లో చిందేయడానికి మోనాల్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే మోనాల్ ని సంప్రదించడం.. మహేష్ సినిమా కావడంతో మోనాల్ వెంటనే ఓకే చెప్పేయడం జరిగిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మోనాల్ లో అందమే కాదు.. అంతకుమించి మంచి నటి ఉంది. దాన్ని వాడుకునే దర్శకుడు కావాలని ఆమె గురించి తెలిసిన వారు చెబుతున్నారు.