కేంద్ర బడ్జెట్ : కొత్త సాంప్రదాయం.. ట్యాబ్’తో బడ్జెట్ !
కేంద్ర బడ్జెట్-2021 రాబోతుంది. మరికొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. కరోనా విజృంభణ తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో.. ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఈ సారి ట్యాబ్ ద్వారా బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. అంతే.. పేపర్ లెస్ అన్నమాట. డిజిటల్ ఇండియాకు పెద్దపీఠ వేస్తున్నామని మోడీ సర్కార్ సంకేతాలు ఇస్తోంది.
ఇక కేంద్ర బడ్జెట్ లో వంటగ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న సంబ్సిడీని ఇంకాస్త పెంచేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. అదే సమయంలో బంగారం దిగుమతులపై ఉన్న పన్నుల శాతాన్ని కూడా తగ్గించనున్నట్టు సమాచారం. పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు ప్రోత్సాహాన్ని అందించడం వల్ల కొండెక్కిన ఆ ఉత్పత్తుల ధరలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారు.
అదే సమయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రూ.6 వేల నుంచి ఎనిమిది వేల నుంచి పది వేల రూపాయలకు పెంచబోతున్నారు. కిసాన్ రైలు, విమాన సేవల విస్తృతిని ఇంకాస్త పెంచడం వంటివి చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా వైద్య, విద్యుత్ సంబంధిత వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను, రక్షణ శాఖ పరికరాలను దేశంలోనే తయారు చేసేలా నిర్ణయాలు ఉండబోతున్నాయి. రైలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్మలమ్మ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.