లెగ్ స్పిన్నర్’గా మారిన బుమ్రా


టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా లెగ్ స్పిన్నర్ గా మారారు. ఇంకా చెప్పాలంటే.. మరో కుంబ్లే అనిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం నెట్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారత స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లేలా నెట్స్‌లో బంతులు విసురుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ  వీడియోపై అనిల్ కుంబ్లే స్పందించాడు. ‘వెల్ బుమ్రా.. నాలానే బౌలింగ్ చేస్తూ ఉన్నావు. నీలా బౌలింగ్ చేయాలనే వారికి నువ్వు స్ఫూర్తిగా నిలుస్తావు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో రాణించాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ వీడియో సందేశాన్ని పంపారు