బడ్జెట్-2021 : 20 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుకే

వాహన పొల్యూషన్ తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వాహనాల ఎక్సపైరీ గురించి స్పష్టమైన ప్రకటన చేసింది. వ్యక్తిగత వాహనాలు 25 యేళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 యేళ్ల వరకే వినియోగించాలని చెప్పింది. ఆ తర్వాత వాటికి తుక్కుకు వేయాల్సిందే అన్నమాట.

ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో బడ్జెట్ లో ఆరోగ్యానికి కేంద్ర పెద్దపీఠ వేసింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.