97.05% చేరిన రికవరీ రేటు

దేశంలో కరోనా రికవరీ రేటు 97.05 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 14,225 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1,04,62,631కు చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో 11,039 కొత్త కేసులు నమోదయ్యాయ్. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 1.07కోట్ల మందికి వైరస్ సోకింది. అలాగే క్రియాశీల రేటు 1.52 శాతానికి తగ్గింది. ఇంకోవైపు 24 గంటల్లో 110 కొవిడ్ మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,54,596కి చేరింది.

తెలంగాణ గడిచిన 24 గంటల్లో 185 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,94,924కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,604కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 197 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,91,312కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి రెండు నాటికి 41,38,918కి టీకా పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 1,88,762 మంది టీకా వేయించుకున్నారని తెలిపింది.