ట్విస్ట్ : మళ్లీ రాజకీయాల్లోకి రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నానని.. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీ ఏర్పాటు ఉంటుందని ప్రకటించిన రజనీ… ఆఖరి నిమిషంలో యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రావొద్దని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులకి సారీ కూడా చెప్పారు. అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి.. తాజాగా కొత్త ట్విస్ట్ వచ్చిపడింది.

రజనీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం లేదని మాతమే చెప్పారు. కానీ రాజకీయాల్లోకి రానని చెప్పలేదని.. ఆయన సన్నిహితుడు గాంధీ మక్కల్‌ ఇయక్కం నేత తమిళురువి మణియన్‌ బాంబు పేల్చారు. దీంతో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ మొదలైంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. రజనీ తీరు చూస్తుంటే.. ఆయన భాజాపాకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరీ.. భాజాపాలో చేరి… తమిళనాడులో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి సాయపడతారా ? లేక.. ఇతర పార్టీల గెలుపు కోసం మద్దతు ఇస్తారా ?? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి.. రజనీ పొలిటికల్ చిత్రం.. ఇంకా ముగియలేదని తెలుస్తోంది.