ఇచిత్రం.. కుక్కు సీమంతం !
మనిషికి నిజమైన, విశ్వాసపాత్రమైన నేస్తాలు కుక్కలే. కొంతమంది పెంపుకు జంతువులను కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఖమ్మంలో ఓ కుటుంబం అయితే కుక్కుని కూతురుగా చూసుకుంటోంది. కుక్కు ఏకంగా సీమంతం కూడా చేసేశారు. అది కూడా గ్రాండ్ గా. మందు, విందుతో.. సొంత కూతురు సీమంతం చేసినదానికి ఏమాత్రం తీసిపోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సత్తుపల్లిలోని ఓ కుటుంబం కూడా వారి ఇంట్లోని పెంపుడు కుక్కను కన్నబిడ్డలా చూసుకున్నారు. పెంపుడు కుక్క గర్భం దాల్చడంతో దానికి అంగరంగ వైభవంగా సీమంతం నిర్వహించారు. చుట్టుపక్కల వాళ్ళను పిలిచి వాయినాలు అందించి, సీమంతం పాటలు పాడి అచ్చంగా మనుషులకు ఎలాగైతే ఈ వేడుక చేస్తారో అలానే చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.