మెగాస్టార్’కు నో చెప్పిన నయన్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లూసిఫర్ రిమేక్ లో చిరు నటించనున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు.కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్‌పై ఆర్‌బీ చౌదరి.. ఎన్‌వీప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో నటీనటుల ఎంపికని మొదలెట్టారు. హీరోయిన్ గా నయనతారని అనుకున్నారు. ఆమెని సంప్రదించారు కూడా. కానీ నయన్ నో చెప్పినట్టు సమాచారమ్. దీనికి గల కారణాలు ఏంటీ ? అన్నది మాత్రం తెలియరాలేదు. వాస్తవానికి లూసిఫర్ మాతృకలో హీరోయిన్ పాత్ర లేదు. అయితే మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. ఆయనకి తోడుని తీసుకొచ్చారు. హీరోయిన్ పాత్రని క్రియేట్ చేశారు. ఆమెతో ఆటా-పాటా ఉండేలా ప్లాన్ చేశారని తెలిసింది. అయితే ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం కారణంగానే నయన్ నో చెప్పి ఉంటుందని చెప్పుకుంటున్నారు.