టక్ రాహుల్.. సూపరెహె!
టాలీవుడ్ హీరో నాని టక్ జగదీష్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. బహుశా.. నానిని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఆదర్శంగా తీసుకున్నట్టు కనబడుతోంది. గురువారం రాహుల్ గాంధీ టక్ తో పార్లమెంట్ కు వచ్చారు. స్టయిలీష్ లుక్ లో కనిపించారు. రాహుల్ సాధారణంగా ఎప్పుడూ పైజామా వేసుకుని కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో జీన్స్, టీషర్ట్ వేసుకుంటారు. కానీ తాజాగా ఫార్మల్ డ్రెస్ లో తళుక్కుమన్నారు. బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో టక్ చేసుకుని పార్లమెంటుకు వచ్చారు. ట్యాబ్ పట్టుకుని, మాస్క్ వేసుకుని వస్తున్న ఆయనను తొలుత సొంత పార్టీ ఎంపీలే గుర్తు పట్టలేదు.
ఆ తర్వాత రాహుల్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇటీవలి కాలంలో రాహుల్ దూకుడు పెంచారు. జనాల్లోకి ఆయన విస్తృతంగా వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని రెగ్యులర్ గా టార్గెట్ చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ఆయన యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ డ్రెస్సింగ్ స్టయిల్ ని కూడా మార్చడం విశేషం. ఇక కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలని రాహుల్ గాంధీ తిరిగి స్వీకరించేందుకు కూడా ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.