ట్రైలర్ టాక్ : చెక్


నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చెక్’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ నెల 26న (ఫిబ్రవరి 26) చెక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెక్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘అణువు నుంచి అనంతం వ‌ర‌కు ఏది క‌ర్మ‌ను త‌ప్పించుకోలేదు’ అంటూ ముర‌ళీ శ‌ర్మ చెప్పే మాటల‌తో ట్రైల‌ర్ మొదలైంది.

నితిన్ ఖైదీగా జైలు జీవితం అనుభ‌వించే ప‌రిస్థితికి గ‌ల కార‌ణమేంట‌నేదానిపై స‌స్పెన్స్ నెల‌కొంది. ర‌కుల్ ప్రీత్‌సింగ్ లాయ‌ర్ గా క‌నిపిస్తుండ‌గా.. నితిన్ ను నిర్దోషిగా బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. ఫిదా ఫేం సాయిచంద్ నితిన్ కు జైల్‌మేట్స్ గా క‌నిపిస్తున్నారు.ట్రైలర్ మ‌ధ్య‌లో ప్రియావారియ‌ర్ తో నితిన్ రొమాన్స్ చేయడం చూడొచ్చు. మొత్తంగా.. ట్రైలర్ ని చూస్తే.. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా గ్రిప్పింగా ఉండనుందని అర్థమవుతోంది.