ఢీ సీక్వెల్.. మంచు విష్ణు షాకింగ్ లుక్ !

శ్రీను వైట్ల‌ దర్శకత్వంలో మంచు విష్ణు-జెనీలియా జంటగా నటించిన చిత్రం ‘ఢీ’. 2007లో వచ్చిన ఢీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులని ఫుల్లుగా నవ్వించింది. సునీల్, బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు హైలైట్. ఇప్పుడీ.. ఆ మేజిక్ ని రిపీట్ చేసేందుకు శ్రీనువైట్ల-మంచు విష్ణు రెడీ అయ్యారు. ఢీ సీక్వెల్ గా డీ అండ్ డీ (డబుల్ డోస్) తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరోవైపు మంచు విష్ణు ‘డీ అండ్ డీ’ కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ప‌ర్‌ఫెక్ట్ లుక్‌లోకి మారేందుకు గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌లో వ్యాయామం చేస్తున్నాడు. ఈ విష‌యాన్ని శ్రీను వైట్ల తెలిపాడు. ‘స్క్రిప్ట్ కోసం మేం కూడా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాం. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ‌తాం’ అంటూ శ్రీను వైట్ల స్ప‌ష్టం చేశాడు. ఇక శ్రీనువైట్ల షేర్ చేసిన పిక్ లో మంచు విష్ణు షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కండలు పెంచి.. భీకరంగా ఉన్నాడు.

ఈ చిత్రానికి మ‌హ‌తి సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌లుగా అను ఎమ్మాన్యుయేల్, ప్రగ్యా జైస్వాల్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తొలి పార్ట్‌లో న‌టించిన శ్రీహ‌రి, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి చ‌నిపోగా, వారి పాత్ర‌ల‌కు ఎవ‌రిని ఎంపిక చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.